కోవాక్స్ కార్యక్రమం ఏ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతోంది?
Sakshi Education
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచానికి చేయూతనందిస్తామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆగస్టు 5న చెప్పారు.
2021 ఏడాది 2 కోట్ల డోసుల కరోనా టీకాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాక్సిన్ కార్యక్రమం ‘కోవాక్స్’కు 100 మిలియన్ అమెరికన్ డాలర్లు విరాళంగా ఇస్తామన్నారు. తాము ఇప్పటిదాకా 75 కోట్ల డోసులను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అందించినట్లు చైనా విదేశాంగ శాఖ ఇటీవలే ప్రకటించింది. ఇందులో కోటి డోసులను కోవాక్స్ కార్యక్రమానికి ఇచ్చామని వెల్లడించింది. అన్ని దేశాలకు టీకాలను సమానంగా అందజేయాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌వో కోవాక్స్ కార్యక్రమాన్ని చేపట్టింది.
కస్టమ్స్ సమాచారం కోసం ప్రత్యేక పోర్టల్
కస్టమ్స్ ప్రక్రియలు, నియంత్రణపరమైన నిబంధనల గురించి సమాచారం అందించేందుకు పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ఒక పోర్టల్ ( www.cip.icegate.gov.in/CIP ) ను ఆగస్టు 4న ప్రారంభించింది. ఎగుమతులు, దిగుమతులకు వీలుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ఔషధ నియంత్రణ సంస్థల సమాచారం కూడా ఈ పోర్టల్‌లో పొందుపరిచారు.

Published date : 07 Aug 2021 05:46PM