Skip to main content

కోపరేటివ్ బ్యాంకుల పటిష్టతకు బిల్లు

డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా కోపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మార్చి 3న ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టింది.
Current Affairsఉభయసభల ఆమోదం అనంతరం ఇది చట్టంగా అమల్లోకి రానుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) తరహా సంక్షోభాలు భవిష్యత్తులో జరగకుండా చూసేందుకు ఈ బిల్లు తక్షణావసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభకు తెలిపారు.

ఈ బిల్లుతో కోపరేటివ్ బ్యాంకులు ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి వచ్చినప్పటికీ.. పాలనాపరమైన అంశాల పర్యవేక్షణ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్స్ పరిధిలోనే ఉండనుంది. సరైన నియంత్రణ, మెరుగైన నిర్వహణ ద్వారా కోపరేటివ్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకుల మాదిరిగా పటిష్టం చేయడం బిల్లు లక్ష్యం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
లోక్‌సభలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు : కోపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోకి తీసుకొచ్చేందుకు
Published date : 04 Mar 2020 05:38PM

Photo Stories