కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ నివేదికను రూపొందించిన సంస్థ?
Sakshi Education
ప్రపంచ పర్యావరణ పరిస్థితులపై రూపొందించిన ‘కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ’ నివేదికను ఆగస్టు 9న ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) విడుదల చేసింది.
వేడెక్కుతున్న హిందూ మహా సముద్రం
పర్యావరణ మార్పుల కారణంగా హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్ చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని వెల్లడించింది. ఉష్ణోగ్రత పెరుగుదలతో భారత్‌లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ నివేదిక విడుదల
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్)
ఎందుకు : ప్రపంచ పర్యావరణ పరిస్థితులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు...
ప్రపంచ కర్బన ఉద్గారాలను కట్టడి చేసే విధానాన్ని బట్టి ఐదు రకాల భవిష్యత్ అంచనాలను నివేదిక ప్రస్తావించింది. 2021, నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదిక చర్చకు రానుంది. పర్యావరణ పరిస్థితి చేయిదాటిపోతోందని నివేదిక రూపకర్తలో ఒకరైన లిండా మెర్న్స్ చెప్పారు. ఈ ఉత్పాతం నుంచి తప్పుకునే అవకాశం లేదని హెచ్చరించారు.
నివేదికలోని ముఖ్యాంశాలు
నివేదికలోని ముఖ్యాంశాలు
- ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదు.
- పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలో ఉష్ణోగ్రతలు గతంలో అనుకున్న ప్రమాద స్థాయిలను మించి పోతాయి. ఈ ఉత్పాతం నుంచి తప్పుకునే అవకాశం లేదు.
- ప్రపంచ పర్యావరణంలో సంభవిస్తున్న ఈ శీతోష్ణస్థితి మార్పు మానవ తప్పిదాల వల్ల జరుగుతోందనేందుకు సందేహమే లేదు.
- రాబోయే ప్రమాదం తప్పిపోవాలంటే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిఉంటుంది.
- 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి.
- 1970 నుంచి మానవ చర్యల కారణంగా సముద్ర పర్యావరణంలో మార్పులు వస్తున్నాయి. 1990తో పోలిస్తే ఆర్కిటిక్ సముద్రం 40 శాతం కుంచించుకుపోయింది.
వేడెక్కుతున్న హిందూ మహా సముద్రం
పర్యావరణ మార్పుల కారణంగా హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్ చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని వెల్లడించింది. ఉష్ణోగ్రత పెరుగుదలతో భారత్‌లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ నివేదిక విడుదల
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్)
ఎందుకు : ప్రపంచ పర్యావరణ పరిస్థితులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు...
Published date : 11 Aug 2021 06:10PM