Skip to main content

కోచి, లక్షద్వీప్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుకు ఆమోదం

కేరళ రాష్ట్రం, ఎర్నాకులం జిల్లాలోని కోచి నగరం, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్‌సీ) కనెక్టివిటీని కల్పించే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Edu news

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో డిసెంబర్ 9న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేబుల్ ప్రాజెక్టుకు రూ.1,072 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

మరోవైపు భారత్, సురినామ్ మధ్య ఆరోగ్యం, వైద్య రంగాల్లో సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, లగ్జెంబర్గ్ క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సీఎస్‌ఎస్‌ఎఫ్ మధ్య ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

సురినామ్ రాజధాని: పారామరిబో; కరెన్సీ: సురినేమీ డాలర్
లక్సెంబర్గ్ రాజధాని: లక్సెంబర్గ్ సిటీ; కరెన్సీ: యూరో


Published date : 10 Dec 2020 07:15PM

Photo Stories