కంబళ అనే సాంప్రదాయ క్రీడను ఎక్కడ నిర్వహిస్తారు?
కరావళి ప్రాంత సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా కంబళ క్రీడను భావించే ప్రజలు... దాన్ని కాపాడుకోవడానికి పోటీలను నిర్వహిస్తుంటారు. నవంబర్‌లో మొదలయ్యే కంబళ సీజన్ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ పోటీల్లో ఏడు రకాల పోటీలు ఉన్నాయి. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు.. కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు.
ప్రపంచ రికార్డు...
కంబళ క్రీడల్లో భాగంగా... బురదనీటిలో సాగే దున్నపోతుల పరుగు పందేల్లో ఒలింపిక్స్ పరుగు రికార్డులు బద్ధలవుతున్నాయి. బురదమడిలో వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.15 సెకన్లలో దక్షిణ కన్నడ జిల్లా బైందూరుకు చెందిన విశ్వనాథ్ పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. ఫిబ్రవరి 8న నిర్వహించిన పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. మొత్తం 125 మీటర్ల దూరాన్ని 11.44 సెకన్లలో విశ్వనాథ్ పూర్తి చేశాడు.
2020 ఏడాది శ్రీనివాసగౌడ 9.55 సెకన్లలో, అదేవిధంగా నిశాంత్ శెట్టి 9.51 సెకన్లలో 100 మీటర్ల పరుగు సాధించి అప్పటికి సరికొత్త రికార్డును సృష్టించారు. విశ్వనాథ్ వీటిని అధిగమించాడు.