Skip to main content

కజక్‌స్థాన్ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ రాజీనామా

కజక్‌స్థాన్ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ మార్చి 19న తన పదవికి రాజీనామా చేశారు.
దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పదవిలో ఉన్న ఆయన జీవన ప్రమాణాలు పడిపోతుండడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొనడాన్ని గమనించి ఇటీవలే మొత్తం మంత్రివర్గాన్ని తొలగించారు. చమురు నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ ప్రగతి మందగించడంతో నూతన ప్రణాళికను రూపొందించారు.

నూర్‌సుల్తాన్ తన పదవికి రాజీనామా చేసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ‘జాతి నేత’గా కొనసాగుతారు. దానిప్రకారం విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు సెనేట్ ఛైర్మన్ కస్యం జొమ్రాట్ టొకాయెవ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాదే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
కజక్‌స్థాన్ అధ్యక్షుడు రాజీనామా
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్
Published date : 20 Mar 2019 05:15PM

Photo Stories