కిసాన్ మాన్-ధన్ యోజనప్రారంభం
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (పీఎం-కేఎంవై)కు పేర్ల నమోదు ఆగస్టు 9న ప్రారంభమైంది.
ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ... జమ్మూకశ్మీర్, లదాఖ్ సహా దేశ వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
- పీఎం-కేఎంవైలో చేరిన రైతులకు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ.3వేల చొప్పున పింఛను లభిస్తుంది.
- అయిదు ఎకరాలు (రెండు హెక్టార్ల) లోపు భూమి కలిగిన రైతులు పీఎం-కేఎంవైకు అర్హులు.
- సభ్యులుగా చేరేవారి వయస్సు ప్రాతిపదికగా నెలకు రూ.55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
- కామన్ సర్వీస్ కేంద్రాల్లో ప్రాథమికంగా పేర్లను నమోదు చేసుకునేందుకు అయ్యే రూ.30 వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
- ప్రతి సభ్యుడు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పింఛను పథకానికి జమ చేస్తుంది.
- 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతినెలా రూ.3వేల చొప్పున పింఛను వస్తుంది.
- పథకంలో చేరిన తర్వాత కనీసం అయిదేళ్ల వరకూ క్రమం తప్పకుండా నెలవారీ విరాళాన్ని చెల్లించాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (పీఎం-కేఎంవై) ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎందుకు : రైతులకు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ.3వేల చొప్పున పింఛను అందించేందుకు
ఏమిటి : ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (పీఎం-కేఎంవై) ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎందుకు : రైతులకు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ.3వేల చొప్పున పింఛను అందించేందుకు
Published date : 10 Aug 2019 07:14PM