Skip to main content

కిలిమంజారోను అధిరోహించిన ఐపీఎస్ అధికారి తరుణ్

ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి జనవరి 22న అధిరోహించారు.
Current Affairs
ఇప్పటివరకు మొత్తం ఆరు పర్వతాలను ఆయన అధిరోహించారు. పంజాబ్‌కు చెందిన తరుణ్ హైదరాబాద్ నగర నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీస్ కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణుడైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన అన్వితారెడ్డి కూడా జోషితో కలసి కిలిమంజారోను అధిరోహించారు. ఆమె ప్రస్తుతం రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాలలో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. కిలిమంజారో పర్వతం ఆఫ్రికా దేశం టాంజానియాలో ఉంది.

టాంజానియా రాజధాని: డోడోమా; కరెన్సీ: టాంజానియన్ షిల్లింగ్
టాంజానియా ప్రస్తుత అధ్యక్షుడు: జాన్ మాగుఫులి
టాంజానియా ప్రస్తుత ప్రధానమంత్రి: కాసిమ్ మజాలివా

క్విక్ రివ్యూ :

ఏమిటి : కిలిమంజారోను అధిరోహించిన ఐపీఎస్ అధికారి
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి
ఎక్కడ : కిలిమంజారో, టాంజానియా
Published date : 23 Jan 2021 06:19PM

Photo Stories