Skip to main content

కీలకమైన ఎనిమిది బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ శాసనసభ వానాకాలం సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 14న పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది.
Current Affairs

ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత బిల్లులపై చర్చ చేపట్టారు. మొత్తం 8 బిల్లులను మంత్రులు ప్రతిపాదించగా, చర్చ అనంతరం బిల్లులను ఆమోదిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

శాసనసభ ఆమోదించిన 8 బిల్లులు...

  1. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన, క్రమబద్ధీకరణ) బిల్లు 2020
  2. తెలంగాణ విపత్తు, ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి (ప్రత్యేక నిబంధనలు) బిల్లు 2020
  3. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) (సవరణ) బిల్లు 2020
  4. తెలంగాణ కోశ బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు 2020
  5. తెలంగాణ వస్తువులు, సేవల బిల్లు (రెండో సవరణ)
  6. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధాన (టీ ఎస్ బీపాస్) బిల్లు
  7. తెలంగాణ న్యాయస్థాన రుసుము, దావాల మదింపు (సవరణ) బిల్లు
  8. తెలంగాణ సివిల్ న్యాయస్థానాల (సవరణ) బిల్లు


రెవెన్యూ బిల్లుకు మండలి ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రెవెన్యూ బిల్లుకు శాసన మండలి ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు వీఆర్వో వ్యవస్థ రద్దు, తెలంగాణ పురపాలక శాసనాల (సవరణ) బిల్లు, తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లులకు మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.

చదవండి: కొత్త రెవెన్యూ బిల్లు-వివరాలు

Published date : 15 Sep 2020 05:38PM

Photo Stories