Skip to main content

కేంద్రం, ఆర్‌బీఐ కలసి పనిచేయాలి: శక్తికాంత దాస్

నిదానించిన దేశ జీడీపీ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మరింత సన్నిహితంగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు.
వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోవడం ద్రవ్య గణాంకాలపై ఒత్తిళ్లకు దారి తీస్తున్నట్టు ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో గవర్నర్ ఈ మేరకు పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణకు ఉమ్మడి చర్యలు అవసరమని, ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

మందగించిన వృద్ధికి మద్దతునిచ్చేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ ఇప్పటికి మూడు విడతల్లో పావు శాతం చొప్పున మొత్తం 0.75 శాతం రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే.
Published date : 28 Jun 2019 06:08PM

Photo Stories