కేంద్ర న్యాయశాఖ మంత్రితో ఏపీ సీఎం జగన్ భేటీ
Sakshi Education
కేంద్ర న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 15న జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో శాసనసభ.. మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసిందని, కేంద్ర న్యాయ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. మహిళలు, చిన్నారులపై నేరాలను నియంత్రించేందుకు రూపొందించిన దిశ చట్టం వెంటనే అమలులోకి వచ్చేలా కేంద్రం నుంచి తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేయాలని కోరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 17 Feb 2020 06:03PM