కేంద్ర మంత్రి రవిశంకర్ ఆవిష్కరించిన డాక్ పే యాప్ ఉద్దేశం?
Sakshi Education
తపాలా శాఖ (ఇండియా పోస్ట్), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారుల సౌలభ్యం కోసం సరికొత్త యాప్ ‘డాక్ పే’ రూపకల్పన జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్ పే యాప్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కేంద్ర న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : తపాలా శాఖ (ఇండియా పోస్ట్), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారుల కోసం
డిసెంబర్ 15న న్యూఢిల్లీలో కేంద్ర న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డాక్ పే యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా తపాలా శాఖ, ఐపీపీబీ అందించే సేవలను ఇంటి వద్దే నుంచే పొందవచ్చు. నగదు పంపడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్, సేవలు, వ్యాపారులకు చేసే చెల్లింపులు వంటి సేవలను ఖాతాదారులు డిజిటల్‌గా పూర్తిచేయొచ్చు.
ఐపీపీబీ గురించి...
- ఐపీపీబీని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో 2018, సెప్టెంబర్ 1న ప్రారంభించారు.
- ఐపీపీబీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి తొలుత సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లతో ఐపీపీబీని ప్రారంభించారు.
- ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్ పే యాప్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కేంద్ర న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : తపాలా శాఖ (ఇండియా పోస్ట్), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారుల కోసం
Published date : 16 Dec 2020 05:54PM