Skip to main content

కేంద్ర జలసంఘం నూతన చైర్మన్‌గా నియమితులైన అధికారి?

పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో)గా పనిచేసిన ఎస్కే హల్దర్‌ను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Current Affairs
ప్రస్తుత సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే జైన్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.సీడబ్ల్యూసీ సభ్యుడు(డబ్ల్యూపీఅండ్‌పీ)గా వ్యవహరిస్తున్న ఎస్కే హల్దర్ అత్యంత సీనియర్ కావడంతో ఆయన్ని తదుపరి సీడబ్ల్యూసీ చైర్మన్‌గా కేంద్రం నియమించింది.

హల్దర్ కృష్ణా బోర్డు చైర్మన్‌గా, పీపీఏ సీఈవోగా 2016 నుంచి 2018 వరకు పనిచేశారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల (బేసిన్)తో పాటు పోలవరం ప్రాజెక్టుపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ఎస్కే హల్దర్
ఎందుకు : ప్రస్తుత సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే జైన్ పదవీ విరమణ చేయడంతో
Published date : 01 Jan 2021 06:06PM

Photo Stories