Skip to main content

జూడో ప్లేయర్‌ దీపాన్షు బాలయన్ పై నిషేధం

డోపింగ్‌లోపట్టుబడటంతో భారత జూడో ప్లేయర్‌ దీపాన్షు బాలయన్ పై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) 22 నెలల నిషేధాన్ని విధించింది.
Current Affairs
2019, జూన్ లో జూనియర్‌ ఆసియా చాంపియన్ షిప్‌ ట్రయల్స్‌ లో అతడి నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా... అందులో నిషేధిత ఉత్ప్రేరకం ‘ఫ్యూరోసెమైడ్‌’ ఉన్నట్లు తేలింది. డోపింగ్‌ నిబంధన 10.2.1 ప్రకారం అతడిపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించాల్సిందిగాఏడీడీపీని ‘నాడా’ కోరింది. అయితే ఉద్దేశపూర్వకంగానే దీపాన్షు ఆ ఉ్రత్పేరకాన్ని వాడినట్లు ‘నాడా’ రుజువు చేయకపోవడంతో అతడి శిక్ష తగ్గింది.

ఫ్యూరోసెమైడ్‌ను మూత్రాన్ని అధికంగా ఉత్పత్తి చేసేందుకు వాడతారు. దాంతో అథ్లెట్‌ తన బరువు కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల అథ్లెట్‌ తన బరువు కంటే తక్కువగా ఉన్న కేటగిరీలో పాల్గొనే అవకాశం కలుగుతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత జూడో ప్లేయర్‌ దీపాన్షుబాలయన్ పై 22 నెలల నిషేధం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు :జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)
ఎందుకు :డోపింగ్‌లోపట్టుబడటంతో...
Published date : 26 Aug 2020 04:44PM

Photo Stories