జో బెడైన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోదం
అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లలో బెడైన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్‌స 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. దీంతో 78 ఏళ్ల బెడైన్ 2021, జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
క్యాపిటల్ భవనంపై దాడి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై జనవరి 6న దాడి చేశారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బెడైన్ ఎన్నికను ధ్రువీకరించడానికి కాంగ్రెస్ ఉభయసభలు సమావేశమైన సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు అమెరికా జెండాలు చేతబూని వచ్చి ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల్ని నిలువరించడానికి జరిగిన పోలీసుల కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మరణించారు. ఈ దాడిని భారత్ సహా ప్రపంచ దేశాలు ఖండించాయి.