జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన బ్రెగ్జిట్
Sakshi Education
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందం 2020, జనవరి 31 అర్ధరాత్రి 11 గంటల నుంచి(బ్రిటన్ కాలమానం ప్రకారం) అమల్లోకి వచ్చింది.
దీంతో ఈయూ కూటమిలోని సభ్య దేశాల సంఖ్య 28 నుంచి 27కి తగ్గింది. బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ‘అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహం’నినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు. కాగా, బ్రెగ్జిట్‌తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి 2020, డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది.
బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది. ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణం’అని పేర్కొన్నారు. ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చిందన్నారు.

Published date : 04 Feb 2020 05:09PM