Skip to main content

జనవరి 1న శిశు జననాల్లో భారత్‌కు అగ్రస్థానం

2020 జనవరి 1న శిశు జననాల్లో భారత్ అగ్రస్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి.
Current Affairsజనవరి 1న ప్రపంచవ్యాప్తంగా 3,92,078 మంది పిల్లలు పుడితే వారిలో భారత్‌లోనే 67,385 మంది పుట్టినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్ జనవరి 2న వెల్లడించింది. మొత్తంగా జన్మించిన 3,92,078 శిశువుల్లో సగం మంది కేవలం ఎనిమిది దేశాల్లోనే జన్మించారని పేర్కొంది.

విరీ చైల్డ్ అలైవ్ ఉద్యమం...
ప్రతీ ఏడాది జనవరి 1న చిన్నారుల జననాన్ని యూనిసెఫ్ ఒక వేడుకగా నిర్వహిస్తుంది. విరీ చైల్డ్ అలైవ్ పేరుతో ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. బిడ్డల్ని సంరక్షించడంలో నర్సులకి శిక్షణ ఇవ్వడానికి వెంటనే పెట్టుబడులు పెట్టడం, తల్లీ బిడ్డలకి సరైన పోషకాహారం, మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.

2020, జనవరి 1న...
తొలి శిశువు జన్మించిన దేశం:
ఫిజి
ఆఖరి శిశువు జన్మించిన దేశం: అమెరికా

ఏ దేశంలో ఎంతమంది పుట్టారు

దేశం

శిశు జననాల సంఖ్య

భారత్

67,385

చైనా

46,299

నైజీరియా

26,039

పాకిస్తాన్

16,787

ఇండోనేసియా

13,020

అమెరికా

10,452

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో

10,247

ఇథియోపియా

8,493


మరో ఏడేళ్లలో చైనాని దాటేస్తాం
2019 నాటికి చైనా జనాభా 143 కోట్లయితే, భారత్ జనాభా 137 కోట్లుగా ఉంది. ప్రపంచ జనాభాలో చైనా వాటా 19శాతమైతే, భారత్ వాటా 18శాతంగా ఉంది. 2027 నాటికి జనాభాలో చైనాని భారత్ దాటేస్తుందని యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఈ శతాబ్దం చివరినాటికి భారత్ 150 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, చైనా110 కోట్లతో రెండో స్థానంలో, నైజీరియా 73 కోట్లతో మూడో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, పాకిస్తాన్‌లు ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లుగా ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020, జనవరి 1న శిశు జననాల్లో భారత్‌కు అగ్రస్థానం
ఎవరు : ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 03 Jan 2020 06:04PM

Photo Stories