Skip to main content

జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు?

కర్ణాటకలోని కొడగు జిల్లా కేంద్రం మడికెరిలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.50 కోట్లతో కొత్తగా నిర్మించిన దివంగత సైన్యాధికారి జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 6న ప్రారంభించారు.
Current Affairs
తిమ్మయ్య సాహసగాథలకు అద్దం పట్టేలా ఆయన జన్మించిన ఇల్లు ‘సన్నిసైడ్’నే మ్యూజియంగా మార్చారు.

ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం...
మడగాస్కర్ అడవిలో గుర్తించబడిన ఊసరవెల్లి ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం. దీని శాస్త్రీయ నామం ‘‘బ్రూకెసియా ననా’’. కాలుష్యం, అడవుల నరికివేత కారణంగా అరుదైన ఈ జాతి ఊసరవెల్లులు అంతరించిపోతున్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : దివంగత సైన్యాధికారి జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : మడికెరి, కొడగు జిల్లా, కర్ణాటక
ఎందుకు : తిమ్మయ్య సాహసగాథలకు గుర్తుగా
Published date : 08 Feb 2021 06:21PM

Photo Stories