Skip to main content

జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లుకి ఆమోదం

అఖిల భారత సర్వీసు ఆఫీసర్స్ జమ్మూకశ్మీర్ కేడర్‌ని అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం యూనియన్ టెర్రిటరీలతో కలిపేందుకు ఉద్దేశించిన జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) 2021 బిల్లుకు ఫిబ్రవరి 13న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది.
Current Affairs

భారత మ్యాపింగ్ పాలసీలో నిబంధనల సడలింపు
భారత మ్యాపింగ్ పాలసీలో నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15న కీలక నిర్ణయం తీసుకుంది. జియోస్పేషియల్ డేటా నియంత్రణా నియమావళిలో మార్పులు చేయడం ద్వారా ఈ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు సమానావకాశాలు ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..

  • కొత్త నిబంధనల్లో భాగంగా మ్యాపింగ్ రంగాన్ని డీరెగ్యులేట్ చేయడంతో పాటు సర్వేయింగ్, మాపింగ్, యాప్స్ అభివృద్ధికి ప్రీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మార్పులు చేశారు.
  • దేశీయ సంస్థలు జియోస్పేషియల్ డేటా సేవలందించేందుకు ముందుకు వస్తే ఎలాంటి ముందస్తు అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్సులు, లెసైన్సులు అవసరం లేదు.
  • తాజా మార్పులతో 2030 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన జియో స్పేషియల్ డేటా అందుబాటులోకి వస్తుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు-2021కి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : లోక్‌సభ
ఎక్కడ : అఖిల భారత సర్వీసు ఆఫీసర్స్ జమ్మూకశ్మీర్ కేడర్‌ని అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం యూనియన్ టెర్రిటరీలతో కలిపేందుకు
Published date : 16 Feb 2021 05:46PM

Photo Stories