Skip to main content

జల వివాదాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

అంతర్ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ఉద్దేశించిన అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు-2019ను లోక్‌సభ జూలై 31న మూజువాణి ఓటుతో ఆమోదించింది.
ఈ బిల్లును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలమయ్యాయనీ, కాబట్టి పరిష్కార విధానంలో మార్పు అవసరమన్నారు. ప్రపంచంలోని జనాభాలో 18 శాతం మంది ఇండియాలోనే ఉన్నారనీ, కానీ ప్రపంచంలోని మంచి నీళ్లలో 4 శాతమే మన దేశంలో ఉండటంతో ఇది తీవ్ర సమస్యగా మారనుందని చెప్పారు.

బిల్లులో ఏముంది?:
  • అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956ను సవరించేందుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది.
  • వేర్వేరు ధర్మాసనాలతో ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడం, వివాదాలను పరిష్కరించేందుకు ఓ కాలపరిమితి విధించి, కచ్చితంగా ఆ సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రత్యేకతలు.
  • సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహిస్తారు. అవసరమైనప్పుడు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తారు. వివాదం పరిష్కారమయ్యాక అవి రద్దవుతాయి. గరిష్టంగా రెండేళ్లలోపు వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : అంతర్ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు
Published date : 01 Aug 2019 05:48PM

Photo Stories