Skip to main content

జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ జూన్ 21న ఢిల్లీలో జరిగింది.
ఎలక్ట్రిక్ వాహనాలపై, ఎలక్ట్రిక్ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్‌మెంట్ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

జీఎస్టీ కౌన్సిల్ కౌన్సిల్ నిర్ణయాలు
  • అక్రమ లాభ నిరోధక విభాగం పదవీ కాలాన్ని 2021 నవంబర్ వరకు రెండేళ్లపాటు పొడిగింపు.
  • జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా అక్రమంగా లాభాలు పోగేసుకుంటే ఆ మొత్తంలో 10% జరిమానా విధింపునకు నిర్ణయం. ప్రస్తుతం ఈ జరిమానా నిబంధనల మేరకు గరిష్టంగా రూ.25,000గానే ఉంది.
  • ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను ప్రస్తుతం 12 శాతం ఉండగా, దీన్ని 5 శాతానికి, ఎలక్ట్రిక్ చార్జర్లపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గించాలన్న ప్రతిపాదనలను ఫిట్‌మెంట్ కమిటీకి నివేదింపు.
  • ఆధార్‌తో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు అనుమతి.
  • 2020 జనవరి 1 నుంచి ప్రయోగాత్మక విధానంలో ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్ విధానం ప్రారంభం. అప్పటి నుంచి జీఎస్టీ నమోదిత మల్టీప్లెక్స్‌లు ఈ టికెట్లనే జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే, రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థలు ఎలక్ట్రానిక్ రూపంలోనే ఇన్‌వాయిస్‌లను జారీ చేయాలి.
  • నూతన జీఎస్టీ రిటర్నుల దాఖలు వ్యవస్థ కూడా 2020 జనవరి 1 నుంచి అమల్లోకి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ
ఎప్పుడు : జూన్ 21
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 22 Jun 2019 05:45PM

Photo Stories