Skip to main content

జీఎన్‌ఎస్‌ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన

గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) పథకంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ఎత్తిపోతల పథకం అనుసంధానానికి వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు.
Current Affairsరూ.1,272 కోట్లతో చేపట్టిన ఈ అనుసంధాన పథకం ద్వారా కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

మరోవైపు చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి పులివెందుల ప్రాజెక్టు, లింగాల మండలాల్లోని చెరువులను నింపడంతోపాటు యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి రాయచోటిలో శంకుస్థాపన చేశారు. అలాగే రాయచోటి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • రూ.60 వేల కోట్లతో రాయలసీమకు గోదావరి వరద జలాలను తరలిస్తాం.
  • పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం.
  • తెలుగుగంగ సామర్థ్యం 11,500 క్యూసెక్కుల నుంచి 18,000 క్యూసెక్కులకు పెంచుతాం.
  • కేసీ కెనాల్, నిప్పులవాగు కెపాసిటీని 12,500 క్యూసెక్కుల నుంచి 35,000 క్యూసెక్కులకు పెంచుతాం.
  • గండికోటకు దిగువన మరో 20 టీఎంసీలతో రిజర్వాయర్‌కు ప్రతిపాదనల తయారీ

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జీఎన్‌ఎస్‌ఎస్ - హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : రాయచోటి, వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 25 Dec 2019 05:52PM

Photo Stories