Skip to main content

జీ-7 సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం

ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26 వరకు జరిగిన జీ-7 దేశాల 45వ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ప్లాస్టిక్ వస్తువులను వాడి పారేసే విధానానికి స్వస్తి పలికేందుకు, నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, పర్యావరణ పరరిక్షణ దిశగా భారత్ చేపడుతున్న చర్యలను జీ-7 భేటీలో మోదీ ప్రస్తావించారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని సమ్మిళిత, సాధికారికతల ద్వారా సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుని ఆర్పడానికి అన్నివిధాల సాయపడడానికి జీ7 దేశాలు ముందుకొచ్చాయి. అడవుల పునరుద్ధరణ ప్రణాళిక అంశంలో కూడా బ్రెజిల్‌కు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని జీ7 దేశాలు హామినిచ్చాయి. 2.2 కోట్ల అమెరికా డాలర్లు సాయం చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.

జీ-7 గురించి...
  • పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల సమూహమే జీ-7.
  • ఈ కూటమిలో అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి.
  • విదేశీ వ్యవహారాలు, ఆర్థికాంశాలు, భద్రత, వాణిజ్యం, వాతావరణం, వ్యవసాయం, కార్మిక సమస్యల వంటివి జీ-7 సదస్సుల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి.
  • యూరోపియన్ యూనియన్ ఈ కూటమిలో సభ్యదేశం కానప్పటికీ సమావేశాలకు హాజరవుతుంది.
  • జీ-7 దేశాల 45వ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జీ-7 దేశాల 45వ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బియార్రిట్జ్, ఫ్రాన్స్
Published date : 27 Aug 2019 05:25PM

Photo Stories