Skip to main content

జెట్ ఎయిర్‌వేస్ కు నరేష్ గోయల్ రాజీనామా

జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్ మార్చి 25న తన పదవికి రాజీనామా చేశారు.
అలాగే జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, ఎతిహాద్ ఎయిర్‌వేస్ పీజేఎస్‌సీ నామినీ డెరైక్టర్ కెవిన్ నైట్ వైదొలిగారు. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 80కు పైగా విమానాలు సర్వీసులు నడపలేని పరిస్థితుల్లో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు.

జెట్ ఎయిర్‌వేస్‌కు 1500 కోట్లు
తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యలను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్‌కు బ్యాంకులు తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించనున్నాయి. ఈ మేరకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ రూపొందించిన పరిష్కార ప్రణాళికను జెట్ ఎయిర్‌వేస్ బోర్డు మార్చి 25న ఆమోదించింది. డెట్ ఇనుస్ట్రుమెంట్ల జారీ ద్వారా బ్యాంకులు రూ.1,500 కోట్లు అందించనున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించాల్సి ఉంది. దీంతో 11.4 కోట్ల షేర్లను బ్యాంకులకు జారీ చేయడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా కంపెనీ మార్చనున్నది. దీంతో బ్యాంకులకు సంస్థలో నియంత్రిత వాటా 51 శాతం లభిస్తుంది. ప్రమోటర్ నరేష్ గోయల్ వాటా ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : నరేష్ గోయల్
ఎందుకు : జెట్ ఎయిర్‌వేస్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా
Published date : 26 Mar 2019 05:39PM

Photo Stories