జాతీయ ఇంధన పొదుపు అవార్డులను ప్రకటించే సంస్థ?
Sakshi Education
కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డులు-2020లలో 13 అవార్డులను భారతీయ రైల్వే కైవసం చేసుకుంది.
జనవరి 11న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్ర విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర హోదా) ఆర్‌కే సింగ్ ఈ అవార్డులను రైల్వే అధికారులకు అందజేశారు.
అవార్డుల్లో... పశ్చిమ రైల్వే ప్రథమ బహుమతి, తూర్పు రైల్వేకు ద్వితీయ బహుమతి, ఈశాన్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్లకు రవాణా కేటగిరీలో మెరిట్ సర్టిఫికెట్ దక్కాయి. రైల్వే వర్క్ షాప్ సబ్ కేటగిరీలో విజయవాడ డీజిల్ లోకోషెడ్ ప్రథమ బహమతి సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఇంధన పొదుపు అవార్డులు-2020 ప్రధానం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ)
ఎందుకు : ఇంధన పొదుపు విషయంలో విశేష కృషి చేసినందుకు

Published date : 12 Jan 2021 05:52PM