జాతీయ చేనేత దినోత్సవం
Sakshi Education
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేనేత రంగంలోని 40 వేల కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.
ఆలంబన యాప్ ఆవిష్కరణ
చేనేత జౌళి శాఖ రూపొందించిన ‘ఆలంబన యాప్’ను కేటీఆర్ ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు గ్రహీతలకు ఇస్తున్న నగదు పురస్కారాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని మంత్రి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన 18 మంది కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలు అందజేశారు.
క్విక్ రివ్యూ :
జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7) సందర్భంగా చేనేత, జౌళి శాఖల అధికారులు, కలెక్టర్లు, చేనేత కార్మికులతో ఆగస్టు 7న నిర్వహించిన వర్చువల్ సమావేశం మంత్రి పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ‘నేతన్నకు చేయూత’ పథకం కింద కరోనా సమయంలో రూ.93 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.10.24 కోట్లతో పోచంపల్లి, ఆలేరు, కనుకుల, శాయంపేట, కమలాపూర్, ఆర్మూర్, వెల్టూర్, వేములవాడలో బ్లాక్ లెవల్ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించామని, గద్వాల చేనేత పార్కుకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు.
ఆలంబన యాప్ ఆవిష్కరణ
చేనేత జౌళి శాఖ రూపొందించిన ‘ఆలంబన యాప్’ను కేటీఆర్ ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు గ్రహీతలకు ఇస్తున్న నగదు పురస్కారాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని మంత్రి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన 18 మంది కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలు అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ చేనేత దినోత్సవం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు
Published date : 10 Aug 2020 05:40PM