Skip to main content

ITTF Czech Open title: చెక్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నిలో విజేతగా నిలిచిన భారతీయుడు?

ఐటీటీఎఫ్‌ చెక్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ విజేతగా అవతరించాడు.
చెక్‌ రిపబ్లిక్‌లోని ఒలొమాక్‌లో ఆగస్టు 25న జరిగిన ఫైనల్లో సత్యన్‌ 4–0 తేడాతో యెవ్‌హెన్‌ ప్రైషెపా (ఉక్రెయిన్‌)ను చిత్తు చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ తుది పోరులో సత్యన్‌ 11–9, 11–6, 11–6, 14–12తో ఘన విజయం సాధించాడు. సత్యన్‌ కెరీర్‌లో ఇది మూడో అంతర్జాతీయ ఐటీటీఎఫ్‌ టైటిల్‌ కాగా...నాలుగేళ్ల విరామం తర్వాత ఇది దక్కడం విశేషం.

చాంప్స్‌ బార్టీ, జ్వెరెవ్‌
అమెరికాలోని ఓహియో రాష్ట్రం మేసన్‌ నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక వెస్టర్న్‌ అండ్‌ సదరన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ (సిన్సినాటి మాస్టర్స్‌)లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతలుగా నిలిచారు. ఆగస్టు 22న జరిగిన పురుషుల ఫైనల్లో జ్వెరెవ్‌ 6–2, 6–3తో ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు. మహిళల ఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ బార్టీ 6–3, 6–1తో జిల్‌ టెచ్‌మన్‌ (స్విట్జర్లాండ్‌)పై ఘన విజయం సాధించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఐటీటీఎఫ్‌ చెక్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ విజేత?
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : భారత ఆటగాడు సత్యన్‌ జ్ఞానశేఖరన్‌
ఎక్కడ : ఒలొమాక్, చెక్‌ రిపబ్లిక్‌
Published date : 26 Aug 2021 06:30PM

Photo Stories