ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది?
Sakshi Education
పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(AB-PMJAY)’’ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ఏబీ–పీఎంజేఏవై సెహత్(AB-PMJAY SEHAT) పేరుతో డిసెంబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా ఈ పథకాన్ని కశ్మీర్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద కశ్మీర్‌లోని 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కశ్మీరీ సంప్రదాయ ఫెరాన్ వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలను 2019 ఏడాది కశ్మీర్ వ్యవసాయ కూలీ ఒకరు మోదీకి బహూకరించారు.
చదవండి: ఆయుష్మాన్ భారత్ పథకం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానం ద్వారా
ఎందుకు : కశ్మీర్‌లోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు
Published date : 28 Dec 2020 05:51PM