ఇటీవల ఏ దేశంలో ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు?
Sakshi Education
మయన్మార్ సైనిక పాలకులు ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
అంగ్‌సాన్‌సూకీ సహా ప్రజాప్రభుత్వాన్ని గద్దె దింపిన మిలటరీ జుంటా... ప్రజాందోళనలు విస్తరిస్తుండటంతో ఈ చర్య తీసుకుంది. సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ దేశంలోని అతిపెద్ద నగరం యాంగూన్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పుకార్లు వ్యాప్తి చేస్తున్నారంటూ ఇప్పటికే సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సేవల్ని నిలిపేసింది. మయన్మార్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్ కొనసాగుతోందని.... లండన్ కేంద్రంగా ఉన్న ఇంటర్నెట్ అంతరాయాలు, నిషేధాలను పసిగట్టే ‘నెట్‌బ్లాక్స్’ సంస్థ తెలిపింది.
మయన్మార్(బర్మా) రాజధాని: న్యేఫిడా(Naypyidaw)
మయన్మార్ కరెన్సీ: క్యాట్ (kyat)
మయన్మార్ అధికార భాష: బర్మీస్(Burmese)
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నెట్ సేవల నిలిపివేత
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : మయన్మార్ సైనిక పాలకులు
ఎక్కడ : మయన్మార్
ఎందుకు : సైనిక పాలనకు వ్యతిరేకంగా పజాందోళనలు విస్తరిస్తుండటంతో
మయన్మార్(బర్మా) రాజధాని: న్యేఫిడా(Naypyidaw)
మయన్మార్ కరెన్సీ: క్యాట్ (kyat)
మయన్మార్ అధికార భాష: బర్మీస్(Burmese)
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నెట్ సేవల నిలిపివేత
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : మయన్మార్ సైనిక పాలకులు
ఎక్కడ : మయన్మార్
ఎందుకు : సైనిక పాలనకు వ్యతిరేకంగా పజాందోళనలు విస్తరిస్తుండటంతో
Published date : 08 Feb 2021 06:23PM