ఇస్రో చైర్మన్ శివన్‌కు అబ్దుల్ కలాం అవార్డు
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చెర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్‌కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం అవార్డును ప్రధానం చేసింది.
తమిళనాడు రాజధాని చెన్నైలోని సచివాలయంలో ఆగస్టు 22న జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల మీదుగా.. శివన్ ఈ అవార్డును అందుకున్నారు. 8 గ్రాముల బంగారు పతకం, రూ.ఐదు లక్షల నగదుతోపాటు ప్రశంసాపత్రాన్ని శివన్‌కు అందించారు. శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికిగాను శివన్‌కు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇస్రో చెర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్‌కు అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికిగాను

Published date : 23 Aug 2019 05:47PM