ఇరాన్ నుంచి చమురు దిగుమతుల నిలిపివేత
Sakshi Education
ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేయనుంది.
ఇరాన్‌పై 2018లో ఆంక్షలు విధించిన అమెరికా భారత్, చైనా సహా కొన్ని దేశాలకు మాత్రం దిగుమతులకు మినహాయింపు కల్పించింది. అయితే, త్వరలోనే ఈ మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నట్టు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇరాన్ నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా తర్వాత రెండో అతిపెద్ద దేశం భారత్.
Published date : 24 Apr 2019 05:21PM