ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
Sakshi Education
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 26న జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయ పరిస్థితులు, ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఇరాన్, అమెరికాల మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ఈ భేటీ జరగడం విశేషం. ఇటీవలి కాలం వరకు ఇరాక్, సౌదీ అరేబియాల తరువాత ఇరాన్ నుంచే భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటూ ఉండేది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 27 Sep 2019 05:44PM