Skip to main content

ఇంటింటా ఇన్నోవేటర్‌-2020 ప్రారంభం

వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం కృషి చేసేవారిని గుర్తించి ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ నడుంబిగించింది.
Current Affairs
దీని కోసం ‘ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్ 2020’ అనే అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్ 2020’ ఆన్ లైన్ వెర్షన్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగస్టు 15న హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. 2019 ఏడాది 33 జిల్లాల పరిధిలో ‘ఇంటింటా ఇన్నోవేషన్’వాతావరణాన్ని సృష్టించడంలో విజయవంతమైన తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్ సెల్‌ (టీఎస్‌ఐసీ) కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ వెర్షన్ ను ప్రారంభించింది. క్షేత్ర స్థాయిలో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ను నిర్వహిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ పేర్కొన్నారు.

మెరుగైన ఫీచర్లతో అలాప్‌...
టిక్‌టాక్‌ కంటే మెరుగైన ఫీచర్లతో మేడిన్ హైదరాబాద్‌ నినాదంతో రూపొందించిన ‘అలాప్‌’యాప్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రకటించింది. ఈ యాప్‌ను 13 భాషల్లో స్టార్టప్‌ కమ్యూనిటీ ద్వారా రూపొందించినట్లు టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ కుమార్‌ మక్తాల తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అలాప్‌ యాప్‌ టీజర్, లోగోను ఆగస్టు 15న హైదరాబాద్‌లో విడుదల చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్ 2020 ఆన్ లైన్ వెర్షన్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ :ప్రగతి భవన్, హైదరాబాద్
ఎందుకు :వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం కృషి చేసేవారిని గుర్తించి ప్రోత్సహించడానికి
Published date : 17 Aug 2020 05:35PM

Photo Stories