ఇండియన్ సిమెంట్ రివ్యూ అవార్డు గెలుచుకున్న సంస్థ?
దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సిమెంటు కంపెనీ (స్మాల్ విభాగం)గా అవార్డును కైవసం చేసుకుంది. ముంబైలో మార్చి 17న వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ఎండీ కె. రవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గడిచిన ఆరేళ్లుగా ఆర్థిక పనితీరు, వృద్ధి తదితర అంశాల ప్రాతిపదికన ఎన్‌సీఎల్ ఈ అవార్డును దక్కించుకుంది.
ఐసీడీఆర్‌ఐ–2021లో ప్రధాని మోదీ...
డిజాస్టర్ రిసైలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే అంశంపై మార్చి 17న జరిగిన అంతర్జాతీయ సదస్సు (ఐసీడీఆర్‌ఐ–2021) ప్రారంభోత్సవంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం కచ్చితంగా అవసరమని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సదస్సులో ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ, యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తదితరులతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల, విద్యా సంస్థల ప్రతినిధులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సిమెంటు కంపెనీ (స్మాల్ విభాగం)గా ఇండియన్ సిమెంట్ రివ్యూ పురస్కారాన్ని గెలుచుకున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ (నాగార్జున సిమెంట్)
ఎందుకు : ఆర్థిక పనితీరు, వృద్ధిలో ఉత్తమ ప్రతిభ కనబరినందుకు