ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మోర్సీ మృతి
Sakshi Education
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ(67) కోర్టు హాల్లో కుప్పకూలి మరణించారు.
గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న మోర్సీ జూన్ 17న ఈజిప్టు రాజధాని కైరోలోని కోర్టుకు హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. 30 ఏళ్లపాటు ఈజిప్టును నిరంకుశంగా పరిపాలించిన హోస్ని ముబారక్‌ను 2011లో పదవీచ్యుతుణ్ని చేశాక, 2012లో మోర్సీ ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడయ్యారు. 2013లో సైన్యం మోర్సీని పదవీచ్యుతుడిని చేసి, ఆయన రక్షణమంత్రి అల్ సిసిని అధ్యక్షుడి పీఠంపై కూర్చోబెట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మృతి
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : మొహమ్మద్ మోర్సీ(67)
ఎక్కడ : కైరో కోర్టు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మృతి
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : మొహమ్మద్ మోర్సీ(67)
ఎక్కడ : కైరో కోర్టు
Published date : 18 Jun 2019 05:35PM