Skip to main content

ఈ-అసెస్‌మెంట్ సెంటర్ ప్రారంభం

ఎలక్ట్రానిక్ (ఫేస్‌లెస్) అసెస్‌మెంట్ స్కీమ్‌కు సంబంధించిన నేషనల్ ఈ-అసెస్‌మెంట్ సెంటర్‌ను (ఎన్‌ఈఏసీ) కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే న్యూఢిల్లీలో అక్టోబర్ 7న ప్రారంభించారు.
పన్నుల మదింపు ప్రక్రియలో అధికారుల ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఆదాయపు పన్ను శాఖ ఎలక్ట్రానిక్ (ఫేస్‌లెస్) అసెస్‌మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ-అసెస్‌మెంట్ అందుబాటులోకి రావడంతో అసెసింగ్ అధికారులను పన్ను చెల్లింపుదారులు ప్రత్యక్షంగా కలవాల్సిన సందర్భాలు గణనీయంగా తగ్గనున్నాయి.

ఎన్‌ఈఏసీ స్వతంత్ర కార్యాలయంగా పని చేస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా తదితర 8 నగరాల్లో ప్రాంతీయ ఈ-అసెస్‌మెంట్ కార్యాలయాలు (ఆర్‌ఈఏసీ) ఉంటాయని పేర్కొంది. ప్రతీ ఆర్‌ఈఏసీకి ఆదాయపు పన్ను విభాగం చీఫ్ కమిషనర్ సారథ్యం వహిస్తారని వివరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నేషనల్ ఈ-అసెస్‌మెంట్ సెంటర్ (ఎన్‌ఈఏసీ) ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పన్నుల మదింపు ప్రక్రియలో అధికారుల ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించేందుకు
Published date : 09 Oct 2019 06:02PM

Photo Stories