హ్యాపినెస్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 140వ స్థానం
Sakshi Education
ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 156 దేశాలకు సంబంధించి మార్చి 20న విడుదల చేసిన ‘హ్యాపినెస్ రిపోర్ట్-2019’లో భారత్‌కు 140వ స్థానం లభించింది.
ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలవగా తరువాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్, నెదర్లాండ్‌స ఉన్నాయి. అలాగే అమెరికాకు 19వ స్థానం, పాకిస్తాన్ 67వ స్థానం, బంగ్లాదేశ్ 125వ స్థానం , చైనా 93వ స్థానాలు పొందాయి. యుద్ధ ప్రభావిత దక్షిణ సూడాన్ ఈ సూచీలో అట్టడుగున నిలిచింది. 2018లో భారత్ 133వ స్థానం పొందగా ప్రస్తుతం ఏడు స్థానాలు దిగజారింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హ్యాపినెస్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 140వ స్థానం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఐక్యరాజ్య సమితి
క్విక్ రివ్యూ :
ఏమిటి : హ్యాపినెస్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 140వ స్థానం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఐక్యరాజ్య సమితి
Published date : 21 Mar 2019 05:19PM