Skip to main content

హుస్సేన్‌సాగర్ తీరంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
Current Affairs
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎస్టీ సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి సెప్టెంబర్ 16న అసెంబ్లీ కమిటీ హాల్‌లో విగ్రహం నమూనాను ఎస్సీల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగ, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు.

రూ.140 కోట్ల వ్యయంతో...
  • హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరంలో రూ.140 కోట్ల వ్యయంతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.
  • 45.5 అడుగుల వెడల్పుతో ఏర్పాటయ్యే విగ్రహానికి 791 టన్నుల స్టీలు, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి వినియోగిస్తారు.
  • 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పార్కులో అంబేడ్కర్ విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ ఉంటాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హుస్సేన్‌సాగర్ తీరం, హైదరాబాద్
Published date : 19 Sep 2020 06:13PM

Photo Stories