హన్మకొండ జిల్లాగా వరంగల్ అర్బన్ జిల్లా పేరు మార్పు
Sakshi Education
వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జూన్ 21న శంకుస్థాపన చేశారు.
అలాగే హన్మకొండలో రూ.57 కోట్లతో 3 అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... హన్మకొండ జిల్లాగా వరంగల్ అర్బన్ జిల్లా పేరును మార్చనున్నట్లు వెల్లడించారు. అలాVó వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చనున్నట్లు తెలిపారు. జిల్లాల కొత్తపేర్లపై త్వరలో ఉత్తర్వులు వెలువడాతాయని పేర్కొన్నారు.
వరంగల్‌లో దంత వైద్యశాల
వరంగల్‌లో దంత వైద్యశాల
తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు మరో 4 నగరాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని, రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుందన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య విధానం కెనడాలో ఉందని తెలిసిందని, కెనడా వైద్య విధానంపై ఆధ్యయనానికి ఒక బృందాన్ని అక్కడికి పంపించి, కెనడాను మించిన వైద్య విధానం రాష్ట్రంలో అమలు చేస్తామని పేర్కొన్నారు.
Published date : 21 Jun 2021 05:23PM