Skip to main content

హైకోర్టు సీజేగా జస్టిస్ గోస్వామి ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు.
Edu news

జనవరి 6న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి, అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరాం, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి పాల్గొన్నారు.

జస్టిస్ గోస్వామి...

  • 1961 మార్చి 11న అస్సాం రాష్ట్రం జోరాత్‌లో జన్మించిన జస్టిస్ గోస్వామి... 1985లో గౌహతి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
  • 1985 ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
  • 2011లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
  • 2019లో పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు.
  • జస్టిస్ గోస్వామి మంచి క్రికెటర్ కూడా. ఆయన రంజీ ట్రోఫీలో అస్సాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ లెవల్ అండర్ 19, అండర్ 21లో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గాపమాణ స్వీకారం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
ఎక్కడ : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం, కృష్ణా జిల్లా

Published date : 08 Jan 2021 06:29PM

Photo Stories