హైదరాబాద్‌లో వన్ ప్లస్ ఆర్‌అండ్‌డీ సెంటర్
Sakshi Education
ప్రీమియం మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వన్ ప్లస్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌అండ్‌డీ సెంటర్) నెలకొల్పింది.
1,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రాన్ని తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మేల్యే కె. తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆగస్టు 26న ప్రారంభించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వన్ ప్లస్ ఫౌండర్, సీఈవో పీట్ లావ్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్ ప్లస్ ఆర్‌అండ్‌డీ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మేల్యే కె. తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఎక్కడ : నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్

Published date : 27 Aug 2019 05:21PM