హైదరాబాద్‌లో రఫేల్ సెంటర్ ప్రారంభం
Sakshi Education
హైదరాబాద్‌లో ఏర్పాటయిన ఆస్ట్రా రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ఏఆర్‌సీ) స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగస్టు 26న ప్రారంభించారు.
శంషాబాద్ సమీపంలోని హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయిన ఈ సెంటర్ డిఫెన్స్ కమ్యూనికేషన్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ బలగాలకు ట్యాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ను (బీఎన్‌ఈటీ) అభివృద్ధి చేస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ (ఏఎంపీఎల్), ఇజ్రాయల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్డ్స్ డిఫెన్స్ సిస్టమ్ (ఆర్‌ఏడీఎస్‌ఎల్) కలిసి ఈ ఏఆర్‌సీ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ సెంటర్‌లో ఆస్ట్రాకు 51 శాతం, రఫేల్‌కు 49 శాతం వాటాలున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రా రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ఏఆర్‌సీ) స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి
ఎక్కడ : శంషాబాద్, హైదరాబాద్

Published date : 28 Aug 2019 05:43PM