హైదరాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంటర్ ప్రారంభం
Sakshi Education
చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు డిసెంబర్ 2న ప్రారంభించారు.
ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా ఎం కోడూరి మాట్లాడుతూ... ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో హైదరాబాద్ ఇంటెల్ కేంద్రం పాలు పంచుకుంటుందని వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటెల్ డిజైన్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటెల్ డిజైన్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
Published date : 03 Dec 2019 06:21PM