Skip to main content

హైదరాబాద్‌లో డీబీఐఎల్ తొలి బ్యాంక్ ప్రారంభం

హైదరాబాద్‌లో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్)తొలి బ్యాంక్‌ మార్చి 5న ప్రారంభ‌మైంది.
ఈ సందర్భంగా డీబీఐఎల్ సీఈఓ సురోజిత్ షోమీ మాట్లాడుతూ... డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) గ్రూప్ సాంకేతికత, అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుందని తెలిపారు. ఇక్కడి నుంచే మన దేశంతో పాటూ చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్‌లకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

25 సంవత్సరాల క్రితం ముంబైలో తొలి బ్రాంచ్ ప్రారంభించిన డీబీఎస్ బ్యాంక్ 2015లో పూర్తి సొంత అనుబంధ సంస్థ (డబ్ల్యూఓఎస్) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి దరఖాస్తు చేసుకుంది. 2019, మార్చి 1న ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. దీంతో ప్రస్తుతం దేశంలోని 12 డీబీఎస్ బ్రాంచీలు కూడా డీబీఐఎల్‌లోకి మారాయి. ఇప్పటివరకు డీబీఎస్‌కు 18 దేశాల్లో 280 బ్రాంచీలు, 1200 ఏటీఎం సెంటర్లున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 45 విదేశీ బ్యాంక్‌లున్నాయి. విదేశీ బ్యాంక్ నుంచి డబ్యూఓఎస్ బ్యాంక్‌గా మారిన తొలి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. ఇది 2018, డిసెంబర్‌లో ఆర్‌బీఐ అనుమతి పొందింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డీబీఐఎల్ తొలి బ్యాంక్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ : హైదరాబాద్
Published date : 06 Mar 2019 05:49PM

Photo Stories