హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
Sakshi Education
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆగస్టు 21న ప్రారంభించారు. దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ క్యాంపస్‌లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. అమెజాన్‌కు అమెరికా వెలుపల ఇది ఏకై క సొంత భవనం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో సంస్థకు 300 క్యాంపస్‌లు ఉన్నాయి.
క్యాంపస్ ప్రారోంభోత్సవం సందర్భంగా అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు భారత్‌లో రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టామని వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు ఫుడ్, రిటైల్‌లో ఖర్చు చేశామన్నారు. 2004లో భారత్‌లో అడుగుపెట్టిన అమెజాన్ తొలుత భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఎక్కడ : హైదరాబాద్

Published date : 22 Aug 2019 05:40PM