హాలీవుడ్ సంస్థ ఎస్‌టీఎక్స్‌తో ఏరోస్ విలీనం
Sakshi Education
కోవిడ్ -19 మహమ్మారి విస్తరణతో ప్రపంచ మార్కెట్లలో మొత్తం సినిమా నిర్మాణ రంగం సంక్షోభంలో వుండగా హాలీవుడ్‌కు చెందిన ఎస్‌టీఎక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీనం అవుతున్నట్టు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ ఏప్రిల్ 18న ప్రకటించింది. మొత్తం షేర్ల రూపంలో ఈ విలీనం జరగనుంది.
సీఈఓగా రాబర్ట్..
11 సంవత్సరాల క్రితం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కరోనా వైరస్ కాలంలో కొత్త అవతారాన్ని దాల్చింది. బద్లాపూర్, బజరంగీ భైజాన్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను నిర్మించిన ఏరోస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హాలీవుడ్ కంపెనీతో కలిసి ఈరోస్ ఎస్టీఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్ పేరుతో గ్లోబల్ సంస్థగా అవతరించింది. అలాగే రెండు కంపెనీల విలీనం తరువాత కంపెనీ ఫౌండర్ ప్రస్తుత సీఈఓ కిషోర్ లుల్లా ఎగ్జిక్యూటివ్ కో-చైర్మన్‌గా, ఎస్‌టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ సిమండ్స్ కొత్త కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాలీవుడ్ సంస్థ ఎస్‌టీఎక్స్‌తో విలీనం
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్
ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఎస్‌టిఎక్స్ సంస్థ ఇప్పటికే హాలీవుడ్‌లో 34 సినిమాలు నిర్మించింది. ఇందులో హస్లర్స్, బాడ్ మామ్స్ సినిమాలు రెండూ కలిసి 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.10,500 కోట్లు) గ్రాస్‌ను వసూలు చేశాయి.
సీఈఓగా రాబర్ట్..
11 సంవత్సరాల క్రితం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కరోనా వైరస్ కాలంలో కొత్త అవతారాన్ని దాల్చింది. బద్లాపూర్, బజరంగీ భైజాన్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను నిర్మించిన ఏరోస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హాలీవుడ్ కంపెనీతో కలిసి ఈరోస్ ఎస్టీఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్ పేరుతో గ్లోబల్ సంస్థగా అవతరించింది. అలాగే రెండు కంపెనీల విలీనం తరువాత కంపెనీ ఫౌండర్ ప్రస్తుత సీఈఓ కిషోర్ లుల్లా ఎగ్జిక్యూటివ్ కో-చైర్మన్‌గా, ఎస్‌టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ సిమండ్స్ కొత్త కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాలీవుడ్ సంస్థ ఎస్‌టీఎక్స్‌తో విలీనం
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్
Published date : 20 Apr 2020 06:39PM