గ్రెటా థన్‌బర్గ్‌కు ఆమ్నెస్టీ పురస్కారం
Sakshi Education
ఫైడేస్ ఫర్ ఫ్యూచర్ ఉద్యమాన్ని ప్రారంభించి చిన్న వయస్సులోనే పర్యావరణ పరిరక్షణకు పోరాడుతున్న గ్రెటా థన్‌బర్గ్(16)కు అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (ఆమ్నెస్టీ) అందించే ‘అంబాసిడర్స్ ఆఫ్ కాన్‌సైన్స్’ పురస్కారం లభించింది.
అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో సెప్టెంబర్ 16న జరిగిన కార్యక్రమంలో ఆమ్నెస్టీ అధికార ప్రతినిధుల నుంచి ఆమె ఈ అవార్డును అందుకుంది.
విచ్చలవిడిగా చెట్ల నరికివేత, పరిశ్రమల ఏర్పాటు కారణంగా పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని, వెంటనే దీనిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 2018, ఆగస్టులో థన్‌బర్గ్ ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వాలు పర్యావరణ రక్షణకు తగిన చర్యలు తీసుకొనేవరకు ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరుకావొద్దని ఆమె పిలుపు నిచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆమ్నెస్టీ అంబాసిడర్స్ ఆఫ్ కాన్‌సైన్స్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : గ్రెటా థన్‌బర్గ్
ఎక్కడ : వాషింగ్టన్ యూనివర్సిటీ, అమెరికా

Published date : 18 Sep 2019 06:22PM