‘గ్రామీ’ అవార్డుల విజేతలు...ఈ సారి ఎక్కువగా వీరికే..
Sakshi Education
సాధారణంగా గ్రామీ అవార్డుల్లో పురుష గాయకుల ఆధిపత్యమే కనిపిస్తుంది. ఈసారి మాత్రం గాయనీమణులు సత్తా చాటారు.
63వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ కన్వెన్షన్ సెంటర్‌లో కోవిడ్–19 ప్రొటోకాల్స్ పాటిస్తూ కన్నుల పండువగా జరిగింది. మేగన్ థీ స్టాలియన్, హ్యారీ స్టైల్స్ మొదటిసారిగా గ్రామీని అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ వీడియో అవార్డ్‌సహా మొత్తం నాలుగు గ్రామీలను ప్రముఖ గాయని బియాన్స్ సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా ఆమె ఖాతాలో 28 గ్రామీ పురస్కారాలు చేరాయి. అత్యధిక గ్రామీ అవార్డులు దక్కించుకున్న గాయనిగా బియాన్స్ సరికొత్త రికార్డు సృష్టించారు.
కొన్ని ముఖ్య విభాగాలు..విజేతలు
క్విక్ రివ్యూ:
ఏమిటి : 63వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం
ఎక్కడ : అమెరికాలోని లాస్ ఏంజెలెస్
కొన్ని ముఖ్య విభాగాలు..విజేతలు
విభాగం | విజేత |
రికార్డ్ ఆఫ్ ద ఇయర్ | బిల్లీ ఎలీష్ (ఎవ్రీ థింగ్ ఐ వాంటెడ్) |
ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ | టేలర్ స్విఫ్ట్ (ఫోక్ లోర్) |
సాంగ్ ఆఫ్ ద ఇయర్ | డెర్నెస్ట్ ఎమిలీ, టియారా థామర్ (ఐ కాంట్ బ్రీత్) |
బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్ | హ్యారీ స్టైల్స్ (వాటర్ మెలన్) |
బెస్ట్ పాప్ గ్రూప్ పెర్ఫార్మెన్స్ | లేడీ గాగా, అరియానా గ్రాండీ (రెయిన్ ఆన్ మీ) |
బెస్ట్ న్యూ ఆర్టిస్టు | మేగన్ థీ స్టాలియన్ |
బెస్ట్ మ్యూజిక్ వీడియో | బియాన్స్ (బ్రౌన్ స్కిన్ గర్ల్) |
బెస్ట్ రాక్ సాంగ్ | బ్రిటనీ హోవార్డ్ (స్టే హై) |
క్విక్ రివ్యూ:
ఏమిటి : 63వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం
ఎక్కడ : అమెరికాలోని లాస్ ఏంజెలెస్
Published date : 16 Mar 2021 05:34PM