Skip to main content

గోవా తొలి మహిళా గవర్నర్ కన్నుమూత

గోవా మాజీ గవర్నర్, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి, బీజేపీ సీనియర్ నేత, మృదులా సిన్హా (77) కన్నుమూశారు.
Edu news అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నవంబర్ 18న తుదిశ్వాస విడిచారు. 1942 నవంబర్ 27న బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జన్మించిన మృదులా సిన్హా.. హిందీలో అనేక రచనలు చేశారు. దాదాపు 45కి పైగా పుస్తకాలు రాశారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షరాలిగా, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్‌గా పనిచేశారు. 2014, ఆగస్టు 26 నుంచి 2019 అక్టోబర్ 23 వరకు గోవా తొలి మహిళా గవర్నర్గా పనిచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గోవా మాజీ గవర్నర్, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి, బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : మృదులా సిన్హా (77)
ఎక్కడ : ఢిల్లీ ఎయిమ్స్
ఎందుకు : అనారోగ్య సమస్యలతో
Published date : 19 Nov 2020 06:47PM

Photo Stories