గణనీయంగా పట్టణ జనాభా పెరుగుదల
Sakshi Education
దేశంలో పట్టణ జనాభా 2021–36 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో పెరగనుందని ‘నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్’ తన తాజా నివేదికలో వెల్లడించింది.
2036 నాటికి 152 కోట్ల జనాభా..
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–36 మధ్య కాలంలో గణనీయంగా పట్టణ జనాభా పెరుగుదల
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్
ఎక్కడ :దేశంలో
కేంద్ర ఆరోగ్య –కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశ జనాభాపై నిర్వహించిన అధ్యయనంలో.. 2011–21తో పోలిస్తే 2021–36లో దేశ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గనుందని పేర్కొంది. అయితే, మొత్తం జనాభాలో మాత్రం భారత్ చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోనుందని వివరించింది.
నివేదికలోని ప్రధాన అంశాలు
నివేదికలోని ప్రధాన అంశాలు
- 2011తో పోలిస్తే 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 57 శాతం పెరగనుంది.
- 2011లో 37.70 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 59.40 కోట్లకు చేరుకోనుంది. అంటే, 31 నుంచి 39 శాతానికి చేరుకుంటుంది.
- 2011లో 69 శాతంగా ఉన్న గ్రామీణ జనాభా 2036 నాటికి 61 శాతానికి తగ్గుతుంది.
- ఢిల్లీ జనాభాలో 98 శాతం పట్టణ జనాభా ఉండగా 2036 నాటికి 100 శాతానికి చేరుకుంటుంది. - తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో 50 శాతానికి పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. ఏపీలో పట్టణ జనాభా 42 శాతానికి చేరుకుంటుంది.
- ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు జనాభా పెరుగుదలలో మొదటి రెండు స్థానాల్లో ఉండనున్నాయి. పెరిగే జనాభాలో 36 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉండనుంది.
- 2011లో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మందిగా ఉన్న స్త్రీలు , 2036 నాటికి 952 మందికి చేరుకోనున్నారు. కాగా ఏపీ, తమిళనాడు, కేరళలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు.
2036 నాటికి 152 కోట్ల జనాభా..
- దేశ జనాభా 2021 నాటికి 136 కోట్లకు, 2031 నాటికి 147 కోట్లకు, 2036 నాటికి 152 కోట్లకు చేరుతుంది.
- 2011–21లో దేశ జనాభా పెరుగుదల రేటు 12.5 శాతం ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇదే అతి తక్కువ జనాభా పెరుగుదల రేటు.
- 2021–31లో దేశ జనాభా పెరుగుదల రేటు 8.4 శాతానికి తగ్గుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–36 మధ్య కాలంలో గణనీయంగా పట్టణ జనాభా పెరుగుదల
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్
ఎక్కడ :దేశంలో
Published date : 17 Aug 2020 05:58PM